Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అదేంటంటే..

| Edited By: Shiva Prajapati

Jul 23, 2023 | 2:21 PM

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవ్వాలనుకుంటున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 1 లకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రెసిడెన్షియల్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అదేంటంటే..
Exams
Follow us on

ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవ్వాలనుకుంటున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 1 లకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రెసిడెన్షియల్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏపీ స్టడీ సర్కిల్స్‌లో ఉచిత కోచింగ్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో మూడు స్టడీ సర్కిల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్స్‌లో ఉచితంగా కోచింగ్‌తో పాటు హాస్టల్ సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు ఇతర కేటగిరీలకూ అవకాశం..

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగార్దులతో పాటు బీసీ-ఏ, బీసీ-బి, బీసీ-సి, బీసీ-డి, ఈబీసీ, కాపు, దివ్యాంగులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తోంది. ఆయా కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్ అయిన http://apstdc.apcfss.in వెబ్‌సైట్‌లో అభ్యర్థుల తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్..

UPSC నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్‌తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు కోచింగ్ కోసం ఆగస్టు 5 వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలి. రూ. 6 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా ప్రకటించారు. విశాఖపట్నంలో సివిల్ సర్వీసెస్ కు, విజయవాడలో గ్రూప్ -1, తిరుపతిలో గ్రూప్ -2 కు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..