రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ది తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం, ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకువేస్తోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ది కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా జిల్లాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు,అధికారులు, ఇతర సిబ్బంది విశాఖపట్నం నుంచి సమీక్షలు చేయాలని నిర్ణయించింది.
సమీక్షల్లో భాగంగా విశాఖపట్నంలో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దీనికోసం విశాఖలో మంత్రులు, అధికారులు క్యాంపు కార్యాలయాల ఏర్పాటు కోసం ముగ్గురు అధికారుల కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎక్కడెక్కడ ఏయే శాఖకు సంబంధించిన క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుచేయాలి, అధికారులు బస చేసేందుకు కావాల్సిన భవనాల విషయంలో జీవో జారీ చేసింది. విశాఖపట్నంలో ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలకు సొంత భవనాలున్నాయి. ఆయా కార్యాలయాల్లోనే మంత్రులకు క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని కమిటీ నివేదిక ఇచ్చింది.
మంత్రులతో పాటు అధికారులు కూడా ఆయా భవనాల్లోనే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాలని.. దీనికోసం మొత్తం 2 లక్షల 27 వేల 287 చ.అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇక సొంత కార్యాలయాలు లేని శాఖలకు రిషికొండ లోని మిలినియం టవర్స్ A,B లో లక్షా 75 వేల 516 చ.అడుగుల స్థలాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇక ఆయా శాఖల మంత్రులు, అధికారులు, సిబ్బంది నివాసం ఉండేందుకు కూడా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లను కమిటీ ఎంపిక చేయగా, ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజా ఉత్తర్వులతో త్వరలోనే విశాఖలో క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
* వ్యవసాయ,సహకార శాఖ – ఎండాడ,పీఎం పాలెం పోస్ట్
* పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖ – హనుమంతవాక,ఆదర్శ్ నగర్
* వైద్యారోగ్య శాఖ – హనుమంతవాక
* హోంశాఖ – కృష్ణా నగర్,మహరాణిపేట
* పరిశ్రమల శాఖ – గవర కంచరపాలెం
* పట్టణాభివృద్ది శాఖ – దుర్గానగర్,అరిలోవ,ఎంవీపీ కాలనీ,పెందుర్తి,మద్దిల పాలెం,సిరిపురం సర్కిల్
* దేవదాయశాఖ – సింహాచలం
* పాఠశాల విద్యాశాఖ – భీమునిపట్నం
* రవాణా,రోడ్లు-భవనాలు – మర్రిపాలెం
* గిరిజన సంక్షేమ శాఖ – రుషికొండ
* అధికారుల నివాసాలకు గుర్తించిన భవనాలివే
* ఫారెస్ట్ గెస్ట్ హౌస్ – విశాలాక్షి నగర్
* పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ గెస్ట్ హౌస్ – కైలాసగిరి
* జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ – పెద వాల్తేరు
* టూరిజం గెస్ట్ హౌస్ – హరిత రిసార్ట్స్
జీఏడి,ఇంధన,ఆర్ధిక శాఖ,ప్లానింగ్,న్యాయశాఖ,ఉన్నతవిద్యా శాఖ,గృహనిర్మాణ శాఖ,బీసీ సంక్షేమ శాఖ,పౌరసరఫరాల శాఖ,మహిళా శిశు సంక్షేమ శాఖ,కార్మికశాఖ,మైనార్టీ సంక్షేమ శాఖ,సోషల్ వెల్ఫేర్,ఆర్టీజీఎస్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..