
Andhra Pradesh Former Minister Raghuveera Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ సొంతూరు నీలాకంఠాపురంలో ఫ్యామీలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని పోస్టులతో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. తాజాగా.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇప్పటికే పలుసార్లు తన మనవరాలితో సరదాగా గడుపుతున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రఘువీరారెడ్డి. ఇప్పుడు చిన్నారితో నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను మరోకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రఘువీరారెడ్డి. శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం నీలకంటాపురం చెరువులో మనవరాలితో కలసి తెప్పలో విహారం చేశారు రఘువీరా. సతీమణి, మనవరాలితో కలసి తెప్పలో ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.. కాసేపు చిన్న పిల్లాడిగా మారి మనవరాలితో డ్యాన్స్ చేశారు రఘువీరారెడ్డి.
With my granddaughter sailing on a coracle , at my village #Neelakantapuram pic.twitter.com/zSWPaqqoIg
— Dr. N Raghuveera Reddy (@drnraghuveera) February 22, 2023
గతంతో తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు రఘువీరా. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జీవించడంలో మీకు మీరే సాటి అంటూ అభిమానుల నుంచి ప్రశంసలు పొందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..