AP Weather: మండే ఎండలు.. మంట పుట్టిస్తోన్న వడగాలులు.. బయటకు రావద్దంటూ హెచ్చరికలు

|

Mar 16, 2025 | 8:26 PM

ఏపీలో ఎండలు మంట పుట్టిస్తున్నాయ్.పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయ్. ఎండ వేడి, తేమకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి వచ్చే 3 రోజుల వాతావరణం ఎలా ఉందో.. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందామా మరి. ఆ వివరాలు ఓ లుక్కేయండి.

AP Weather: మండే ఎండలు.. మంట పుట్టిస్తోన్న వడగాలులు.. బయటకు రావద్దంటూ హెచ్చరికలు
Heat Wave
Follow us on

తూర్పు గాలుల ద్రోణి, మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో నైరుతి, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమయిన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

రాయలసీమ:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు.