Andhra Pradesh: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం.. ఆ బొమ్మలతో రిపబ్లి డే శకటం..

| Edited By: Jyothi Gadda

Jan 25, 2025 | 4:23 PM

అంకుడు కర్రలు సహజసిద్ధ రంగులు అద్ది తయారు చేసే ఏటికొప్పాక లక్క బొమ్మలకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.. ఇక్కడి కళాకారుడు రూపొందించిన బొమ్మల సమూహం నమూనా గణతంత్ర దినోత్సవ శకటంగా మారింది. ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీలో ప్రదర్శన చేయబోతోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ఓ శకటం రూపొందించింది. అలాగే ఏపీ తరపున

Andhra Pradesh: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం.. ఆ బొమ్మలతో రిపబ్లి డే శకటం..
Etikoppaka Toys Shakatam
Follow us on

ఢిల్లీ కర్తవ్య పథ్ లో 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ఈసారి ఏపీకి ప్రత్యేకత. దాంతోపాటు అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మల కళాకారులకు అరుదైన గుర్తింపు. ఎందుకంటే 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు.. 10 కేంద్ర ప్రభుత్వ శాఖలో పాల్గొనే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఏపీ తరపున ఏటికొప్పాక లక్క బొమ్మల శకటం పాల్గొంటుంది. ఇందులో వివిధ రాష్ట్రాల్లో తమ శకటాలను వేరువేరు రూపాల్లో ప్రదర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మహాకుంభమేళాకు ప్రచారం కల్పించేలా ఓ శకటం రూపొందించింది. అలాగే ఏపీ తరపున ఏటికొప్పాక లక్క బొమ్మల నమూనాతో శకటం ప్రదర్శించబోతున్నారు.

వాస్తవానికి శతాబ్దల చరిత్ర కలిగింది ఏటి కొప్పాక లక్క బొమ్మలు. అంకుడుకరణ ఉపయోగించి చేతితో బొమ్మలు తయారుచేయడం ఇక్కడి ప్రత్యేకత. వాటికి సహజ సిద్ధ రంగులు అద్ది లక్క పెట్టి ఈ బొమ్మలకు జీవం పోస్తుంటారు అక్కడి కళాకారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు కూడా గెలుచుకున్నాయి ఈ బొమ్మలు. మనకి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2017లో ఈ బొమ్మలకు జిఐ విశిష్ట గుర్తింపు కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మలకు ప్రత్యేక ఉంది. పర్యావరణ ఫ్రెండ్లీగా ఉండడంతోపాటు చిన్నపిల్లలు ఆడుకున్న ఎటువంటి హాని చేయని విధంగా ఉంటాయి.

ఆ కళాకారుడి ప్రతిభకు..

ఇవి కూడా చదవండి

రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటున్న ఏటికొప్పాక లక్క బొమ్మల శకటానికి ఒక ప్రత్యేకత ఉంది. శకటంపై ఆదిదేవుడు విగ్నేశ్వరుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి తో పాటు పల్లె వాతావరణం అన్ని ప్రతిబిపించేలా బొమ్మలు, హిందూ సంప్రదాయంలో జరిగే వివాహ వేడుక వధూవరులు.. పురోహితుడు, సన్నాయి మేళం, వీణలు, హరిదాసు ఇతర దేవతామూర్తులతో రూపొందించారు.

వాస్తవానికి ఇది ఒక కళాకారుడు రూపొందించిన అద్భుతమైన బొమ్మల సమూహం. ఎలమంచిలి మండలం యువ కళాకారుడు గొరసా సంతోష్కుమార్ ఈ నమూనాను తయారు చేశారు. ఏడో తరగతి వరకు చదువుకున్న సంతోష్.. పేరెంట్స్ హస్త కళాకారులు. వారి నుంచి నేర్చుకున్న హస్తకళకు పదును పెట్టి మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతమైన బొమ్మను తయారు చేశాడు.

సంతోష్ చేసిన బొమ్మల సమూహాన్ని నమూనాగా.. రాష్ట్ర ప్రభుత్వం సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపింది. అంకుడు కర్రతో తయారు చేసిన బొమ్మల నమూనాతో శకటాన్ని తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదించారు. ఆ నమూనా శకటానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో.. సంతోష్ కుమార్ ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

డిల్లీ గణతంత్ర వేడుకలకు ఏటికొప్పాక బొమ్మల నమూనా ఎంపిక కవాడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోష్ ను అభినందించారు. ‘ ఏటికొప్పాక బొమ్మలకు గుర్తింపు లభించడం మా కళాకారులకు లభించిన అరుదైన గౌరవం. హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దేవతామూర్తులు హిందూ వివాహ వేడుక పల్లె వాతావరణం తో ఈ బొమ్మల నమూనా తయారు చేశా. ప్రధానమంత్రి మోదీ మన్ కి బాత్ లో కూడా లక్క బొమ్మల కోసం ప్రస్తావించడం ఆనందంగా ఉంది. బొమ్మల తయారీకి కలప సమస్య కోసం ఆ డిప్యూటీ సీఎంకు వివరించారు. ఆయన ప్రత్యేకంగా చొరవ చూపి అంకుడు చెట్లను పెంచేలా అటవీ శాఖ అధికారులకు డైరెక్షన్స్ ఇస్తామన్నారు.’ అని టీవీ9 తో అన్నారు కళాకారుడు సంతోష్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..