గుంటూరు, నవంబర్ 5: గుంటూరు నుంచి వెళ్లిన వైద్యులు విదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సాధించారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండే ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు విదేశాలకు వెళ్లి విశిష్ట సేవలు అందించారు. అయితే విదేశాల్లో చదవుకొని ఇప్పుడు గుంటూరులో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటువంటి ఆసుపత్రుల్లో రావూస్ ఆసుపత్రి ముందంజలో ఉంది. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తుండటంతో విదేశీయులు సైతం ఇక్కడ చికిత్స చేయించుకోవడానికి వస్తున్నారు. గత నెలలో ఇద్దరూ విదేశీయులకు పిట్యూటరీ ట్యూమర్స్ తొలగించి మెరుగైన చికిత్స అందించారు. సాధారణ పరిభాషలో దీన్ని కుషింట్ డిసీజ్ అంటారు.
యూకే, నెదర్లాండ్స్ కు చెందిన ఇద్దరూ రోగులు ఆన్ లైన్ రావూస్ ఆసుపత్రి వైద్యుడు మోహన్ రావు ను ఆన్ లైన్ సంప్రదించి ట్యూమర్స్ తొలగించుకునేందుకు గుంటూరు వచ్చారు. వారిద్దరికీ మోహన్ రావు శస్త్ర చికిత్స చేసి కొలుకునేలా చేశారు. విదేశాల్లో పలు ఆసుపత్రులకు సంప్రందించిన తర్వాత ఈ రోగులిద్దరూ ఆన్ లైన్ గుంటూరులో ఉంటున్న మోహన్ రావును సంప్రదించారు. శస్త్ర చికిత్స చేసేందుక మోహన్ రావు ఓకే అనటంతోనే ఆ రోగులిద్దరూ గుంటూరు వచ్చి చికిత్స చేయించుకున్నారు. సాధారణ వైద్యంతో పాటు కష్టతరమైన శస్త్ర చికిత్సలు చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.
హైదరాబాద్ నిమ్స్ లో పిజీ పూర్తి చేసిన మోహన్ రావు విదేశాల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులను పూర్తి చేశారు. అయితే ఈ ప్రాంతంపై ఉన్న మక్కువతో గుంటూరులోనే ఉంటూ అత్యాధునిక వైద్య సేవలను తక్కువ ఖర్చుకే అందిస్తున్నారు. న్యూరో, స్పైన్ సర్జన్ గా సేవలందిస్తున్న మోహన్ రావుకు జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూరో, స్పైన్ సర్జన్ అవార్డు వరించింది. గ్లోబల్ బ్రాండ్ ఆప్ అవార్డును ఈ ఏడాదికి మోహన్ రావుకు అందించారు. గుంటూరులాంటి సిటీల్లో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న మోహన్ రావును పలువురు అభినందించారు. రానున్న రోజుల్లో ఆధునిక వైద్యాన్ని తక్కువ ఖర్చుతో పేదలుకు అందించాలన్నదే తమ లక్ష్యమని డాక్టర్ మోహన్ రావు తెలిపారు. అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.