Vijayawada: ఏటీఎం చోరీకి విఫలయత్నం.. ఒక్క సారిగా అలారం మోగడంతో..

రాష్ట్రంలో పలు చోట్ల ఏటీఎం చోరీలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిందే. తాజాగా విజయవాడలో ఓ దొంగ ఏటీఏం చోరీకి పాల్పడ్డాడు..

Vijayawada: ఏటీఎం చోరీకి విఫలయత్నం.. ఒక్క సారిగా అలారం మోగడంతో..
Atm Theft

Updated on: Aug 26, 2022 | 10:50 AM

Andhra Pradesh news: రాష్ట్రంలో పలు చోట్ల ఏటీఎం చోరీలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిందే. తాజాగా విజయవాడలో ఓ దొంగ ఏటీఏం చోరీకి పాల్పడ్డాడు. సెక్యురిటీ గార్డు అప్రమత్తం కావడంతో దొంగ పరారయ్యాడు. వివరాల్లోకెళ్తే.. విజయవాడలోని ఏటీఎంలోకి నల్ల దుస్తులు, మంకీ క్యాప్‌ ధరించిన ఓ దొంగ చొరబడ్డాడు. అనంతరం దానిని పగులగొట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం డోర్‌ తెరచుకుంది. ఐతే ఇంతలో ఏటీఎంకు అమర్చిన అలార్‌ మోగింది. దీంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తమయ్యాడు. వెంటనే లోపలికి ప్రవేశించి అగంతకుడిని పట్టుకునేందుకు సెక్యురిటీ గార్డు ప్రయత్నించగా అతన్ని తోసేసి దొంగ బయటికి పరుగెత్తాడు. సెక్యూరిటీ గార్డ్ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.