AP Crime News: ఆర్థరాత్రి దారుణం.. భార్యను చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త

సంక్రాంతి పండగ వేళ ఊరంతా కోలాహలంగా ఉంటే.. ఆ ఇంట్లో మాత్రం విషాదం నిండుకుంది. ఏం కష్టం వచ్చిందో భార్యను హతమార్చి.. తాను కూడా తనువు చాలించాడు...

AP Crime News: ఆర్థరాత్రి దారుణం.. భార్యను చంపి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డ భర్త
AP Crime News

Updated on: Jan 17, 2023 | 8:05 AM

సంక్రాంతి పండగ వేళ ఊరంతా కోలాహలంగా ఉంటే.. ఆ ఇంట్లో మాత్రం విషాదం నిండుకుంది. ఏం కష్టం వచ్చిందో భార్యను హతమార్చి.. తాను కూడా తనువు చాలించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకరు గ్రామానికి చెందిన చిన్న సుబ్బారావు, రోజా దంపతులు. కొన్నేళ్లుగా ఈ దంపతులిద్దరూ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. తమ అనారోగ్యం కారణంగా బంధువులు, స్నేహితులు తమను చిన్నచూపు చూస్తున్నారని కుమిలిపోయేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి (జనవరి 15) నిద్రలో ఉన్న రోజాపై పదునైన ఆయుధంతో సుబ్బారావు దాడి చేసి హత్య చేశాడు. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాత పురుగుల మందు తాగి సుబ్బారావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యల వల్లే దంపతుల మృతికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us