YSR Cheyutha : ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  కంప్యూటర్‌ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో...

YSR Cheyutha : ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ
CM-Jagan

Updated on: Jun 22, 2021 | 4:22 PM

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో  కంప్యూటర్‌ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశారు సీఎం. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత పథకం ద్వారా  జగన్ సర్కార్ ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి..  మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయంతోపాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్‌ చేయూత నిధులు అందిస్తామని స్పష్టం చేశారు.

అర్హత ఉండి రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని.. గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నామన్న సీఎం.. మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ఈ పథకాన్ని చేపట్టామని వెల్లడించారు. ఆరు లక్షలకు పైగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు వైఎస్సార్‌ చేయూత ఇస్తున్నామని సీఎం అన్నారు. వీరందరికీ సామాజిక పింఛన్ల ద్వారా లబ్ధి జరుగుతున్నా.. వైఎస్సార్‌ చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. వారి కాళ్లపై వారు నిలబడితే కుటుంబాలు బాగుంటాయని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రెండేళ్లలోనే వైఎస్సార్‌ చేయూత ద్వారా మహిళలకు దాదాపు రూ.9 వేలకోట్లు ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. మహిళల్లో కొండంత ఆత్మవిశ్వాసం రావాలనే ఈ పథకం చేపట్టామని సీఎం జగన్‌ చెప్పారు.

Also Read: గ్రేటర్ వాసులకు వాటర్ కష్టాలు.. భాగ్యనగరవాసుల దక్కని ఫ్రీ ఫలం.. ఐదింతల బిల్లుతో హడలిపోతున్న జనం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. నెల జీతం రూ. 56,100 పైగానే.. అప్లికేషన్ ఎలాగంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us