AP CM Ys Jagan: ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ.. కీలక అంశాలు ప్రస్తావన.. ఏంటంటే..!

|

May 16, 2021 | 6:05 AM

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోమారు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. జామ్‌ నగర్‌ నుంచి ఆక్సిజన్‌..

AP CM Ys Jagan: ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేఖ.. కీలక అంశాలు ప్రస్తావన.. ఏంటంటే..!
Ys Jagan
Follow us on

AP CM Ys Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరోమారు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. జామ్‌ నగర్‌ నుంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నందుకు జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి గతంలో కంటే ఇప్పుడు ఆక్సిజన్‌ సరఫరా పెంచినందుకు, 7 కంటైనర్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్స్‌ 30 వేలకు పెంచామని, రోజూ 910 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌సరఫరా అవసరం ఉందన్నారు. విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌ నుంచి కేటాయించిన 170 మెట్రిక్ టన్నులకు బదులు 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే వస్తోందని, కర్ణాటక, తమిళనాడు నుంచి ఏపీకి కేటాయిచిన మేర ఆక్సిజన్‌ రావడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు.

దీంతో రాయలసీమలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. జూమ్‌ నగర్‌ నుంచి పంపిన 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మరో రెండురోజులు రాలయసీమలో ఉపయోగపడుతుందనే విషయాన్ని జగన్‌ లేఖలో తెలిపారు. ఒరిస్సా నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ తెచ్చుకునేందుకు పూర్తిగా కృషి చేస్తున్నామని సీఎం జగన్‌ లేఖలో వివరించారు. రాయలసీమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జామ్ నగర్ నుంచి ప్రతి రోజూ 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ పంపాలని విన్నవించారు.

ఇవీ కూడా చదవండి

Women in police : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లోని గర్భిణీ మహిళా సిబ్బందికి ఏపీ డీజీపీ బంపారాఫర్..!

YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి గౌరవ వేతనం పెంపు.. ఉత్తర్వులు జారీ..