AP CM YS Jagan Mohan Reddy Visakha tou: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం(Visakhapatnam) పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీశారదాపీఠం(Sri Sarada Peetham) వార్షిక మహోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ బుధవారం విశాఖకు రానున్నారు. సీఎం రాక సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శారదాపీఠానికి కాన్వాయ్‌తో భద్రత సిబ్బంది ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.విశాఖలోని శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం వార్షిక మహోత్సవాల్లో పాల్గొనున్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా చినముషిడివాడలోని శ్రీశారదాపీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు శారద పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంట ఇరవై ఐదు నిమిశాలకి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం బయలుదేరుతారు. శారదా పీఠం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం జగన్ రాజశ్యామల యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు గత కొన్నేళ్లుగా సీఎం జగన్ ఏటా క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.
విశాఖ శ్రీ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి హాజరవుతున్నారు. నగరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున సోమవారమే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జివిఎంసి కమీషనర్ లక్ష్మీషా లతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం, అక్కడ ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చే సందర్శకులకు ఏర్పాట్లు, చినముసిడివాడలో గల శారదా పీఠంలను సందర్శించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. మంగళవారం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శారదాపీఠానికి కాన్వాయ్‌తో భద్రతా సిబ్బంది ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు కమీషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.
Read Also….. Indian Army: విషాదం.. హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి.. ధ్రువీకరించిన ఆర్మీ