Andhra Pradesh: ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనంగా పౌరసన్మానం చేసిన ఏపీ సర్కార్..

రాష్ట్రపతిగా తొలిసారి ఏపీకి వచ్చిన ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్..

Andhra Pradesh: ఏపీకి తొలిసారి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనంగా పౌరసన్మానం చేసిన ఏపీ సర్కార్..
Andhra Pradesh Cm Jagan

Updated on: Dec 04, 2022 | 4:48 PM

రాష్ట్రపతిగా తొలిసారి ఏపీకి వచ్చిన ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. పోరంకిలో గవర్నర్ బిష్వభూషన్ హరిచందన్.. సీఎం జగన్ ఆమెకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ద్రౌపది ముర్ము.. తిరుమల శ్రీవారు కొలువైన ఈ నేలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని.. అన్ని భాషల్లోకెల్లా తెలుగు శ్రేష్టమైనదంటూ కొనియాడారు. సాదర స్వాగతానికి, తెలుగు ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారామె.

ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయమన్నారు సీఎం జగన్. ద్రౌపది ముర్ము జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడం అందరికీ ఆదర్శమన్నారు. ద్రౌపది ముర్ము జీవితం యావత్ దేశ ప్రజలకు ఆదర్శనం అని పేర్కొన్నారు సీఎం జగన్.

అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనంతో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా పోరంకికి బయలుదేరనున్నారు. మురళి కన్వేన్షన్‌లో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఏర్పాటు చేసిన.. అధికారిక విందు కార్యక్రమంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..