Andhra Pradesh Govt: నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ మొదలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ..

Andhra Pradesh Govt: నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చించే అవకాశం..

Updated on: Dec 18, 2020 | 8:33 AM

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ మొదలు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. జనవరి 9వ తేదీన ఇవ్వనున్న అమ్మఒడి పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే రైతు భరోసా పథకం రెండో విడతకు కూడా మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమచారం. రాష్ట్రంలో మెడికల్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించనున్నారు. దాంతోపాటు.. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంపై చర్చించనున్నారు.

 

Also read:

Telangana BJP: నేడు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..

Covid Vaccine: వచ్చే వారం జో బైడెన్‌కు కరోనా టీకా.. ధృవీకరించిన అధికార యంత్రాంగం..