Bandi Sanjay Arrest: బీఆర్ఎస్‌కు కాలం చెల్లింది.. బండి సంజయ్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఏపీ బీజేపీ నేతలు..

|

Apr 05, 2023 | 9:53 AM

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు అని వ్యాఖ్యానించారు.

Bandi Sanjay Arrest: బీఆర్ఎస్‌కు కాలం చెల్లింది.. బండి సంజయ్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఏపీ బీజేపీ నేతలు..
Somu Veerraju
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు సోమువీర్రాజు.

ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా బండి సంజయ్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. అక్రమ అరెస్టులు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయిపోయిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..