AP Exit Polls: ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..?
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి ముగిసింది. తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయ్. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 82.37శాతం పోలింగ్ నమోదైంది. ఏ సర్వేలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చాయో తెలుసుకుందాం పదండి...
లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించి ఆంధ్రప్రదేశల్‌లొ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. ఆ డీటేల్స్ మీ కోసం….
1. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే…
వైసీపీ : అసెంబ్లీ( 94 -104) , పార్లమెంట్ (13 – 15)
టీడీపీ కూటమి : అసెంబ్లీ (71 – 81), పార్లమెంట్ (10 – 12)
2. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం
టీడీపీకి 95-110
జనసేనకు 14-20
బీజేపీకి 2-5 సీట్లు
వైసీపీకి 45- 60 సీట్లు
3. స్మార్ట్ పోల్ సర్వే…..
టీడీపీ కూటమికి అసెంబ్లీ 93 (+/- 8 ), లోక్ సభ : 13 -16