
ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూటమి అభ్యర్ధులు దూసుకుపోతున్నారు. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ బలహీనంగా ఉన్న రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకుపోతోంది.
ఇక జిల్లాల వారీగా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో పరిశీలిస్తే.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి స్పష్టమైన మెజార్టీ కనబరుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో 13 టీడీపీ ఉంటే.. జనసేన 5, వైసీపీ 1 ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిశీలిస్తే.. టీడీపీ 8, జనసేన 4, వైసీపీ 2, బీజేపీ 1 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1లో ఉన్నాయి.
విజయనగరం(9)లో: టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 1 స్థానాల్లో, కృష్ణా(16)లో: టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 2 స్థానాల్లో, గుంటూరు(17)లో: టీడీపీ 16, జనసేన 1 స్థానంలో లీడ్‌లో ఉన్నారు. అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. అటు బీజేపీ వచ్చేసి.. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం.. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన లీడింగ్‌లో ఉన్నాయి.
మొత్తంగా అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం టీడీపీ 128 స్థానాల్లో, వైసీపీ 20 స్థానాలు, జనసేన 19, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. రాయలసీమలో బద్వేల్, పులివెందుల, పత్తికొండ, ఆలూరు, గుంతకల్లు, జమ్మలమడుగు సహా కొన్ని చోట్ల మాత్రమే వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి హవా చూపిస్తోంది. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలలో కూటమి అభ్యర్థుల ఆధిక్యత కొనసాగిస్తున్నారు. ఒక్క మంత్రాలయం నియోజవర్గంలో మాత్రమే వైసిపి ఆధిక్యత కనబరుస్తోంది. నాలుగు రౌండ్లు ముగిసేసరికి బాలనాగిరెడ్డి 7 ఓట్లకు పైగా ఆధిక్యతలో ఉన్నారు. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను 13 అసెంబ్లీ స్థానాలలో కూటమి అభ్యర్థుల ఆధిక్యత చూపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..