Andhra Pradesh: ‘గ్యాంగ్’ సినిమాను మించిన సీన్.. డోర్స్ క్లోజ్ చేసి మరీ మొత్తం దోచేశారు..

|

Feb 24, 2023 | 3:32 PM

గుంటూరులో నకిలీ ఐటి అధికారులు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. నగరంలోని ప్రగతి నగర్ చెందిన శింగంశెట్టి కల్యాణి ఇంటిలోకి ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు.

Andhra Pradesh: ‘గ్యాంగ్’ సినిమాను మించిన సీన్.. డోర్స్ క్లోజ్ చేసి మరీ మొత్తం దోచేశారు..
Robbery
Follow us on

గుంటూరులో నకిలీ ఐటి అధికారులు భారీగా దోపిడీకి పాల్పడ్డారు. నగరంలోని ప్రగతి నగర్ చెందిన శింగంశెట్టి కల్యాణి ఇంటిలోకి ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఇంటిలోకి వస్తూనే ఇంటి తలుపులు మూసివేశారు. ఐటీ అధికారులమని చెప్పిన వ్యక్తులు ఐడి కూడా చూపించారు. అనంతరం ఇంటిలో ఎక్కెడెక్కడ డబ్బులు, బంగారు ఆభరణాలు ఉన్నాయో చెప్పాలన్నారు. అనంతరం ఆమెను బెదిరించి వేలి ముద్రలు కూడా తీసుకున్నారు.

ఇంట్లో ఉన్న సిసి కెమెరాలను తొలగించడమే కాకుండా హార్డ్ డిస్క్ లను తీసుకెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న యాభై లక్షల రూపాయల నగదు, యాభై సవర్ల బంగారు ఆభరణాలు తీసుకెళ్ళారు. దాదాపు ఇంటిలో రెండు గంటల పాటు హల్ చల్ చేశారు. అయితే ఐటి అధికారులు వెళ్ళిపోయిన తర్వాత అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ సీతారామయ్య వచ్చిన వ్యక్తులు నకిలీ ఐటి అధికారులని భావిస్తున్నామని వాళ్ళను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు ఆ మహిళ ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. నకిలీ ఐటి అధికారులను పట్టుకోవటం కోసం మూడు ప్రత్యేక బృందాలను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు. ఫోన్ కాల్ డేటాను జల్లెడ పడుతున్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరా విజువల్స్ ను సేకరిస్తున్నారు. ఐ20 కార్‌లో నిందితులు వచ్చినట్లు గుర్తించారు. కార్ ను ట్రేస్ చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.

రిపోర్టర్ : టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..