Andhra Pradesh: పొలాలు చదును చేస్తుండగా వినిపించిన భారీ శబ్దాలు.. ఏంటని తవ్వి చూడగా కళ్లు జిగేల్!

|

Jan 30, 2023 | 8:43 AM

ఈ రోజుల్లో పొలాలు లేదా తోటల్లో తవ్వకాలు జరుపుతుండగా చారిత్రక ఆనవాళ్లు బయటపడటం సర్వసాధారణమైపోయింది. అలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం.

Andhra Pradesh: పొలాలు చదును చేస్తుండగా వినిపించిన భారీ శబ్దాలు.. ఏంటని తవ్వి చూడగా కళ్లు జిగేల్!
Andhra Pradesh
Follow us on

ఈ రోజుల్లో పొలాలు లేదా తోటల్లో తవ్వకాలు జరుపుతుండగా చారిత్రక ఆనవాళ్లు బయటపడటం సర్వసాధారణమైపోయింది. అలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం. సరిగ్గా ఆ కోవకు చెందిన ఓ అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తమ పొలాలను చదును చేస్తుండగా.. రైతులకు 12వ శతాబ్దం నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. మరి అవేంటో తెలుసుకుందామా.?

వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా తుని సమీపంలోని గొంపకొండ ప్రాంతంలో రైతులు తమ పొలాలను చదును చేస్తుండగా.. 12వ శతాబ్దం యలమంచిలి చాళుక్యుల కాలం నాటి రాతికుండలు, ప్రమిదలు, శిలాఫలకాలు లాంటివి బయటపడ్డాయి. ఇవి మాత్రమే కాదు.. పురాతన ఇటుకలు, గుడి శిధిలాలు, రాతి శాసనాలు సైతం ఆ ప్రాంతంలో లభ్యమయ్యాయి. గతంలో ఈ గొంపకొండ ప్రాంత సమీపంలో ఓ పట్టణం ఉండేదని.. అగ్ని ప్రమాదం లేదా మశూచి లాంటి భయంకరమైన వ్యాధి కారణంగా అక్కడున్న ప్రజలు వలసపోయి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఉన్న ఆలయం అనంతర కాలంలో మట్టిలో కూరుకుపోయి ఉండొచ్చునని వారి అంచనా. ఇక ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న రైతులు.. వారికి పొలం పనుల్లో దొరికిన ఈ గుడి రాళ్లను సరిహద్దు కంచెగా, అలాగే తవ్వకాల్లో బయటపడిన దేవతామూర్తి విగ్రహాలను స్థానిక దేవతలుగా పూజిస్తున్నారని చెప్పుకొచ్చారు.

కాగా, తవ్వకాల్లో బయటపడిన ఈ శిల్ప సంపద క్రీ.శ. 800-1240 మధ్య కాలంలో వెలసిల్లిన ఆలయానిదిగా పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యలమంచిలి చాళుక్యుల పాలన సమయంలో ఆ ప్రాంతంలో ‘జననాధపట్నం’ అనే పట్టణం ఉండేదని.. తదనంతరం ‘జగన్నాధపురం’ అనే గ్రామం చలామణిలోకి వచ్చిందని చెప్పారు.