CM Jagan: ట్రాన్స్ జెండ‌ర్ల‌కి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2 కోట్ల రూపాయలతో

ట్రాన్స్ జెండర్లకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం ట్రాన్స్ జెండర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనుంది. మరిన్ని వివరాలు తెలుసకుందాం పదండి

CM Jagan: ట్రాన్స్ జెండ‌ర్ల‌కి జగన్ సర్కార్ గుడ్ న్యూస్..  2 కోట్ల రూపాయలతో
Andhra Pradesh CM YS Jagan

Updated on: Apr 16, 2023 | 2:19 PM

సంక్షేమ పథకాలతో జనానికి మరింత చేరువవుతున్నారు సీఎం వైఎస్ జగన్. తాజాగా ట్రాన్స్ జెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కోసం ట్రాన్స్ జెండర్ పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లకు మెరుగైన వైద్యం, మంచి విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారికి సామాజిక భద్రత కల్పించేలా జగన్ సర్కార్ పాలసీని అమలు చేయనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక ఐడెంటిటీ కార్డులను జారీ చేయనుంది. వారి కోసం ప్రస్తుత బడ్జెట్ లో 2 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. నవరత్నాల ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఇప్పటికే జగన్ సర్కార్ సంక్షేమ పథకాలను అందిస్తోంది. వారికి ప్రత్యేకంగా మరికొన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంది. వాళ్లు నివసించే ప్రాంతాల్లో స్వచ్చమైన మంచినీటి సరఫరా చేయాలని, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలని ఏపీ సర్కార్ ఈ పాలసీ రూపొందించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Loading...
Unable to load recommendations.
Follow Us