
చలి చంపేస్తున్న వేళ వాన కబురు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం (18-11-25) నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దీని సంగతి పక్కన పెడితే.. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. మరో బాంబ్ పేల్చారు వాతావరణ కేంద్రం అధికారులు. ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి.. దీని ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏది ఏమైనా ఈ అల్పపీడనాల వల్ల కురిసే వర్షాలు.. రైతుల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల విపత్తల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.