YS Jagan: జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌..

YS Jagan: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వైఎస్‌ జగన్‌ జైలు వద్దకు వస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలి వస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్‌ జైలుకు వెళ్లారు..

YS Jagan: జైలులో వల్లభనేని వంశీని పరామర్శించిన వైఎస్‌ జగన్‌..
Ys Jagan

Updated on: Feb 18, 2025 | 1:11 PM

విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు. కిడ్నాప్‌ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్‌కు పేర్నినాని, కొడాలి నానికి అనుమతి నిరాకరించారు అధికారులు. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేదు అధికారులు.

ములాఖత్‌ ముగిశాక బయటకు వచ్చి వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు. వంశీని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ దిగజారిపోతుందని, కేసు పెట్టలేదని సత్యవర్ధనే కోర్టుకు చెప్పాడని అన్నారు. సత్యవర్ధన్‌ వాంగ్మూలం కూడా నమోదు చేశారన్నారు. వంశీపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేసినట్లు జగన్‌ ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకోవడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి