ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినట్లుగానే.. కూటమి సర్కార్ పాత మద్యం పాలసీని రద్దు చేసి.. కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ షాపులు దక్కించుకునేందుకు ఓ రేంజ్‌లో అప్లికేషన్స్ వచ్చాయి. లాటరీ ద్వారా షాపుల కేటాయింపు కూడా జరిగింది. బుధవారం నుంచి కొత్త షాపులు ఓపెన్ అయ్యాయి. ప్రతి మద్యం దుకాణంలోనూ ప్రీమియం బ్యాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో కొత్త మద్యం ధరలపై తాజాగా స్పష్టత వచ్చింది.
ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
రాయల్ ఛాలెంజర్స్ విస్కీ క్వార్టర్ రూ.230, 8 PM విస్కీ క్వార్టర్ రూ.230, ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ క్వార్టర్ రూ.150, Mc Dowwels No1 విస్కీ క్వార్టర్ క్వార్టర్ రూ.180, హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎం.ఎల్ రూ. 130 ఉంది. ఇదే బ్రాండ్ 750 ఎం.ఎల్ రూ. 750 గా రేటు నిర్ణయించారు. నేవీ బ్లూ క్లాసిక్ విస్కీ ధర.. 180 ఎం.ఎల్ రూ. 150, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ రేటు రూ. 750 ఎం.ఎల్ రూ. 490 ఉంది. బ్రాండ్‌ను బట్టి రేట్స్ ఉన్నాయి..
బ్రాందీ విషయానికి వస్తే.. మాన్సిన్ హౌస్ క్వార్టర్ రూ.240, కైరోన్ రేర్ బ్రాందీ 180 ఎం.ఎల్ ధర రూ.. 300గా ఉంది. నెపోలియన్ సెయింట్ బ్రాండ్ విస్కీ ధర 750 ఎం.ఎల్.. రూ. 1180గా నిర్ణియంచారు. ఇక వోడ్కా మ్యాజిక్ మూమెంట్స్ క్వార్టర్ రూ.230, ఓల్డ్ మంక్ రమ్ము క్వార్టర్ రూ. 230 గా ఫైనల్ చేవారు. బీర్ల విషయానికి వస్తే.. కింగ్ ఫిషర్ Splendid స్ట్రాంగ్ బీర్ రూ. 200, కింగ్ ఫిషర్ స్ట్రోమ్ రీగల్ స్ట్రాంగ్ బీర్ రూ.220.. ఇలా మద్యం ధరలు ఉన్నాయి. రమ్ సెక్షన్ విషయానికొస్తే.. ఓల్డ్ మంక్ స్పెషల్ XXX రేర్ రమ్ 180 ఎం.ఎల్ ధర.. రూ. 230గా నిర్ణయించారు. వైన్ సెగ్మెంట్స్ లో ఫ్రాతెల్లి షిరాజ్ 180 ఎం.ఎల్.. రూ. 410గా ఉంది. కేటగిరీల వారీగా బ్రాందీ, విస్కీ, వోడ్కా, బీర్లు, బ్రీజర్ల ధరలు కింద దిగున ఫేస్‌బుక్ పోస్ట్‌లో చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..