బిగ్ బ్లాస్ట్.. చోరీ గ్యాంగ్ అని అరెస్ట్ చేస్తే.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పేరు బయటకొచ్చింది.. అసలేం జరిగిందంటే..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కోటి 89 లక్షలు.. కేరళకు చెందిన ఓ దోపిడీ గ్యాంగ్‌ కాజేసిన సొమ్ము ఇది.. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ కేరళ గ్యాంగ్‌ను పట్టుకుంటే ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పేరు బయటివచ్చింది..

బిగ్ బ్లాస్ట్.. చోరీ గ్యాంగ్ అని అరెస్ట్ చేస్తే.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పేరు బయటకొచ్చింది.. అసలేం జరిగిందంటే..
Ap News

Updated on: Mar 08, 2023 | 1:15 PM

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా కోటి 89 లక్షలు.. కేరళకు చెందిన ఓ దోపిడీ గ్యాంగ్‌ కాజేసిన సొమ్ము ఇది.. అయితే, తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ కేరళ గ్యాంగ్‌ను పట్టుకుంటే ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ పేరు బయటివచ్చింది.. డబ్బు కాజేసి పారిపోతున్న ఈ కేరళ గ్యాంగ్‌కు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నగదు తరలిస్తుండగా ఈ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.. ఎలా అంటే దోచింది చాలదన్నట్లు రాప్తాడు హైవేపై హవాళా డబ్బును దోపిడీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. వారి నుంచి కోటీ 89 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ మాస్టర్‌ ప్లాన్‌ వెనుక ఓ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేరళ గ్యాంగ్‌ దోపిడీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వంలో జరిగింది. ప్రసుత్తం ఈ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను రహస్యంగా విచారిస్తోంది అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప బృందం.. అన్నీ కోణాల్లో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రాప్తాడు హైవేపై హవాళా డబ్బును దోపిడీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కేరళ దోపిడీ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న 1.89 కోట్ల రూపాయల నగదు.. ఎవరిది..? అనే దానిపై విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..