Anandaiah Letter to AP CM Jagan: మందు తయారీ, పంపిణీకి సహకరించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆనందయ్య లేఖ!

కృష్ణపట్నం ఆనందయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మందు తయారీకి సహకరించాలని కోరారు.

Anandaiah Letter to AP CM Jagan: మందు తయారీ, పంపిణీకి సహకరించండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఆనందయ్య లేఖ!
Anandaiah Letter To Ap Cm Jagan

Updated on: Jun 08, 2021 | 11:44 AM

Anandaiah Letter to AP CM Jagan over Medicine Distribution: కృష్ణపట్నం ఆనందయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మందు తయారీకి సహకరించాలని కోరారు. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ‌ చేయించాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలన్నారు.

కరోనా బాధితులకు విముక్తి కలిగిస్తున్న మందు ఎక్కువ మొత్తంలో తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. సోమవారం ఆనందయ్య అందించే కె మందు పంపిణీకి సైతం హైకోర్టు అనుమతి ఇచ్చింది. నేడు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో నేడు మందు పంపిణీ చేయనున్నారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేయించనున్నారు.

ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్యలు ఎంత మంది? ఆనందయ్య పేరుతో మందు పంపిణీ చేస్తున్న వారు ఎంత మంది? ఆయన శిష్యులు ఎంత మంది? పనికొచ్చే పసరు ఏది? ప్రస్తుత పరిస్థితులను క్యాష్‌ చేసుకుంటున్నది ఎవరు? అటు సర్కారు, ఇటు ప్రభుత్వ అనుమతులతో నిన్నటి నుంచి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గంలో మందు పంపిణీ చేస్తోంది ఆనందయ్య అండ్ టీమ్. అయితే మరికొన్ని చోట్ల కూడా ఆనందయ్య పేరుతో మందు తయారీ, పంపిణీ వివాదంగా మారింది.

కేవలం కృష్ణపట్నంలోనే తయారీ. ప్రస్తుతానికి అయితే సర్వేపల్లి, చంద్రగిరి నియోజక వర్గాల్లోనే పంపిణీ. ఇదే ఆనందయ్య ఇచ్చే క్లారిటీ. మరెవరైనా కావాలంటే.. ముడిపదార్థాలు తీసుకువచ్చి ఇస్తే.. కృష్ణపట్నంలోనే తయారుచేసి.. ఇస్తాం. మరెక్కడా తయారుచేయడం లేదు. తన శిష్యుల పేరుతో ఎవరైన మందు పంపిణీ చేసినా నమ్మవద్దు. ఆనందయ్య పదే పదే స్పష్టం చేస్తున్నారు. దాని ద్వారా ఏవైన ఇబ్బందులు తలెత్తినా.. తనకు సంబంధం లేదు. అదే సమయంలో ఎవరిపడితే వారు మందు పంపిణీ చేసినా.. తమ క్రెడిబులిటీ పొతుందంటున్నారు ఆనందయ్య. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.