
పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన నచ్చిన వీడియోలతో పాటు క్రియేటివ్‌గా ఆలోచించే వ్యక్తుల గురించి పోస్టులు చేస్తుంటారు. అంతేకాకుండా తన కంపెనీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఈ క్రమంలోనే ప్యూరియో ట్రక్ తెలుగు యాడ్‌ను మహీంద్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంటుంది. ట్రక్‌ను సొంతం చేసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి’’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. యాడ్ చాలా బాగుందని చెప్పారు. ఇది ప్రజలకు సైతం తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. పెట్టుబడులకు అన్నీ అవకాశాలు ఉన్న ఏపీలో మహీంద్రా కంపెనీని ఎందుకు పెట్టకూడదు..? మీ కంపెనీకి ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని లోకేశ్ అన్నారు.
ఇప్పుడు లోకేశ్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామిగా ఉండటం తమకు గర్వకారణంగా ఉందని చెప్పారు. ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఏపీలో టూరిజం, మైక్రో ఇరిగేషన్, సోలార్ పవర్ వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై తమ టీమ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఏపీతో ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని.. ముందు ఇంకా చాలా ఉందని అన్నారు. ఆనంద్ మహీంద్రా పోస్టుపై ఏపీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ధన్యవాదాలు! ఆంధ్రప్రదేశ్‌లో అనేక అవకాశాలు ఉన్నాయి.
We would be proud to be a partner in Andhra Pradesh’s journey.
Our teams are already in discussions across multiple sectors, from solar energy to micro-irrigation and of course, tourism.
మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది…ముందు… https://t.co/jdRiAr8o7w— anand mahindra (@anandmahindra) July 19, 2025
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..