Andhra Pradesh: మరింత బలపడిన ఆంధ్రా, అమెరికా సంబంధాలు.. సీఎం జగన్‌పై అమెరికా కాన్సుల్ జనరల్ ప్రశంసలు..

|

May 18, 2022 | 8:36 AM

Andhra Pradesh: ఆంధ్రా, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పారు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌. సీఎం జగన్‌ను కలిసిన ఆయన

Andhra Pradesh: మరింత బలపడిన ఆంధ్రా, అమెరికా సంబంధాలు.. సీఎం జగన్‌పై అమెరికా కాన్సుల్ జనరల్ ప్రశంసలు..
Cm Jagan
Follow us on

Andhra Pradesh: ఆంధ్రా, అమెరికా మధ్య సత్సంబంధాలు మెరుగుపడ్డాయని చెప్పారు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌. సీఎం జగన్‌ను కలిసిన ఆయన, పలు అంశాలపై చర్చించారు. ఆంధ్ర-అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపరచడం కోసం అమెరికా కాన్సులేట్‌కు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సహకారం, చొరవకు ధన్యవాదాలు చెప్పారు ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జోయల్‌ రీఫ్‌మెన్‌, పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వానికి అమెరికన్‌ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం చేసిన కృషిని కొనియాడారు. ఆంధ్రాలో అమెరికా పెట్టుబడులు, పరిశ్రమలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు. దేశంలోని గొప్ప నగరాలలో ఒకటిగా ఎదిగేందుకు విశాఖపట్నానికి అద్భుత అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు జోయల్‌ రీఫ్‌మెన్‌.

విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలను ప్రత్యేకంగా అభినందించారు. వైద్యారోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కోవిడ్‌ మహమ్మారిని సమర్ధవంతంగా కట్టడి చేయడంలో, దేశంలోనే ఏపిని ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా నిలిపారని అన్నారు జోయల్‌ రీఫ్‌మెన్‌. రెన్యూవబుల్‌ ఎనర్జీ కోసం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొనియాడారు. మహిళలు, బలహీనవర్గాలకు 50శాతంపైగా ప్రాధాన్యతనివ్వడాన్ని అభినందించారు. అన్ని రంగాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న విషయాన్ని జగన్‌తో భేటీలో ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, పాఠశాల విద్యపై ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలను అభినందించారు. విశాఖపట్నంలో అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించడానికి యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌కు అందించిన సహాయానికి సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెప్పారు అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌.