టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తాళపత్రాలు విడుదల చేసినా, ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్వీట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా పెంచిన అంచనాలను ఇప్పుడు బయటపెడతామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యల కంటే తన కరకట్ట నివాసం, బినామీల ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడం పై చంద్రబాబు ఆందోళన చెందుతున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. అసలు అమరావతిని ఎంపిక చేసిందే తన బినామీల స్థిరాస్తి వ్యాపారం కోసం. ఇప్పుడు పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారని శోకాలు పెడుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రజా సమస్యల కంటే తన కరకట్ట నివాసం, బినామీల ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంపైనే చంద్రబాబు గారి ఆందోళనంతా. అమరావతిని ఎంపిక చేసిందే తన బినామీల స్థిరాస్తి వ్యాపారం కోసం. పునాదులు కూడా లేవని అమరావతిని చంపేశారని శోకాలు పెడుతున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 24, 2019
ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేత పత్రాల పేరుతో 10 బోగస్ పత్రాలు వదిలారు. అయినా ఘోర పరాజయం తప్పలేదు. ఇప్పుడు అమరావతి, పోలవరం, అడ్డగోలుగా అంచనాలు పెంచిన ప్రాజెక్టులపై వాస్తవ పత్రాలు బయట పెడతారట. తాళ పత్రాలు విడుదల చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు గారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 24, 2019