YSRCP MP Raghurama : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును కాసేపట్లో గుంటూరులోని సిఐడి రీజనల్ ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో ఏపీ సిఐడి అధికారులు రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, సిఐడి ఆఫీస్ వద్దకు మీడియా కు అనుమతి నిరాకరించారు. కాగా, వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై ఐ పి సి 124 (A), 153(A), 505, 124A, 120 (b) of IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏపీ సిఐడి అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని రఘురామపై అభియోగాలు మోపారు. కాగా రఘురామ.. జగన్ ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అరెస్ట్ కు పాల్పడింది. ఎంపీకి భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి రఘురామ కృష్ణంరాజు ని అదుపులోకి తీసుకున్నారు AP సిఐడి పోలీసులు. నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్టుపై ఆయన కుమారుడు భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు.. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారు.. రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా?” అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు.. ఇదంతా ఓ స్కెచ్. వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో అర్థం కావడం లేదు. రఘురామ అరెస్ట్‌పై హై కోర్టులో హౌస్‌మోషన్ దాఖలు చేస్తాం”. అని భరత్ చెప్పారు.
Read also : YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు