వైసీపీ యువ ఎంపీకి కీలక పదవిచ్చిన కేంద్రం..

|

Dec 17, 2019 | 8:46 PM

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు సెంట్రల్ లెవల్‌లో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ దక్కింది. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా దేవరాయలును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటీల్లో.. విద్యాప్రమాణాలు ఎట్లా పెంపొందించాలి, వాటిని ప్రగతి పథంలో ఎలా తీసుకెళ్లాలనే అంశాల విషయంలో..ఈ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. రాష్ట్రాలకు  ఐఐటీల కేటాయింపుకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. నరసరావుపేట […]

వైసీపీ యువ ఎంపీకి కీలక పదవిచ్చిన కేంద్రం..
Follow us on

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలుకు సెంట్రల్ లెవల్‌లో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ దక్కింది. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా దేవరాయలును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటీల్లో.. విద్యాప్రమాణాలు ఎట్లా పెంపొందించాలి, వాటిని ప్రగతి పథంలో ఎలా తీసుకెళ్లాలనే అంశాల విషయంలో..ఈ కమిటీ, కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. రాష్ట్రాలకు  ఐఐటీల కేటాయింపుకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.

నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు…ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్శిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మంచి పేరున్న విఙ్ఞాన్ యూనివర్శిటీకి వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సదరు కమిటీలో చోటు కల్పించినట్టు సమాచారం. కాగా వైసీపీతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు సైతం పార్లమెంట్ కమిటీల్లో పలు కీలక పదవులు దక్కించుకున్నారు.