గత ఐదేళ్లలో ప్రజలు దౌర్భాగ్యమైన పాలన చూశారు : కాకాని

టీడీపీ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌ను టీడీపీ సర్కార్ పట్టించుకోలేదని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కరువు తాండవం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. వాయిదాల పద్ధతిలో పసుపు-కుంకుమ ఎక్కడైనా ఇస్తారా..? అంటూ కాకాని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనుల వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదని.. ఇవాళ జగన్ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు […]

గత ఐదేళ్లలో ప్రజలు దౌర్భాగ్యమైన పాలన చూశారు : కాకాని
MLA Kakani

Edited By:

Updated on: Jun 17, 2019 | 7:23 PM

టీడీపీ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమశిల ప్రాజెక్ట్‌ను టీడీపీ సర్కార్ పట్టించుకోలేదని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కరువు తాండవం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. వాయిదాల పద్ధతిలో పసుపు-కుంకుమ ఎక్కడైనా ఇస్తారా..? అంటూ కాకాని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనుల వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. రైతుల గురించి చంద్రబాబు ఏనాడు ఆలోచన చేయలేదని.. ఇవాళ జగన్ సర్కార్ రైతు కమిషన్ ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు. తన స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని కాకాని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో ప్రజలు ధౌర్భాగ్యమైన పాలన చూశారని ఆయన అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us