Lakshmi Parvathi: అల్లుడి నిరాహార దీక్ష ప్రక్క నుండే వచ్చాను.. శిబిరం దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు: లక్ష్మీ పార్వతి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, తెలుగు అకాడమి ప్రెసిడెంట్ నందమూరి లక్ష్మీ పార్వతి ఇవాళ అమరావతిలో హాట్ కామెంట్స్ చేశారు.

Lakshmi Parvathi: అల్లుడి నిరాహార దీక్ష ప్రక్క నుండే వచ్చాను.. శిబిరం దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు: లక్ష్మీ పార్వతి
Lakshmi Parvathi

Updated on: Oct 22, 2021 | 1:51 PM

Lakshmi Parvathi – Chandrababu: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, తెలుగు అకాడమి ప్రెసిడెంట్ నందమూరి లక్ష్మీ పార్వతి ఇవాళ అమరావతిలో హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత మంగళగిరిలో చేస్తున్న 36 గంటల నిరసన కార్యక్రమం మీద లక్ష్మీ పార్వతి సెటైర్లు వేశారు. ” అల్లుడు నిరాహార దీక్ష ప్రక్క నుండే వచ్చాను. నిరాహారదీక్ష వద్ద బిర్యానీ కోసం, డబ్బులు కోసం మాట్లాడుకుంటున్నారు. తినటం కోసమే మధ్య తెర కట్టారు. అల్లుడి బాగోతం అత్తే చెప్పాలి. ఎన్టీయార్ అమాయకుడు.. అయన్నీ మోసం చేశాడు. దుర్మార్గుడు, దుష్టుడు విధానాలు మారలేదు.” అంటూ లక్ష్మీ పార్వతి తిట్లదండకం చంద్రబాబు గురించి మరోసారి అందుకున్నారు.

“అబద్దంతో అతను పుట్టాడో… అతనితో అబద్దం పుట్టిందో తెలియదు. ఆయన నియోజకవర్గంలో గెలుస్తాడో లేదో తెలియదు. అసమర్థుడైన కొడుక్కి అవినీతి నేర్పాడు. అబద్దాలు నేర్పాడు.. ఇప్పుడు తిట్టడం నేర్పాడు. సంస్కారానికి చంద్రబాబుకి ఎంత దూరమో అందరికి తెలిసిందే.” అని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.

ఇక, వైసీపీ శింగనమల ఎమ్మెల్యే పద్మావతి సైతం తనదైన స్టైల్లో విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం జగనన్న గంట సేపు టైమ్‌ ఇస్తే టీడీపీ నేతల్ని తరిమికొడతామని హెచ్చరించారు అనంతపురంజిల్లా శింగనమల ఎమ్మెల్యే పద్మావతి.

Read also: Pawan Kalyan: తెరమీదకు కొత్త డిమాండ్.. కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న పవన్ కళ్యాణ్