రేపటి నుంచి శాఖల వారీగా జగన్‌ సమీక్షలు

|

May 31, 2019 | 6:50 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్‌లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని […]

రేపటి నుంచి శాఖల వారీగా జగన్‌ సమీక్షలు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ఫౌండేషన్, పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు మొగ్గు చూపేలా పాఠశాలలు తీర్చిదిద్దాలని.. స్కూల్స్‌లో అవసరం అయిన అన్ని మౌలిక సదుపాయాలు, వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇక రోజుకొక శాఖ చొప్పున అన్నిశాఖలపై ఆయన సమీక్షలు నిర్వహిస్తారు. మొదట జూన్ 1వ తేదీన ఫైనాన్స్ అండ్ రెవిన్యూ శాఖలపై రివ్యూ నిర్వహించనున్న ఏపీ సీఎం.. 3వ తేదీన విద్యాశాఖ, 4వ తేదీన జలవనరుల శాఖ,  హౌసింగ్ డిపార్ట్‌మెంట్, 5వ తేదీన వ్యవసాయం అండ్ అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక జూన్ 6వ తేదీన సీఆర్‌డీఏపై రివ్యూ నిర్వహించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.