“పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు”.. త్వరలోనే అన్ని బయటపెడతాం..!

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. పోలవరంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఆందోళన పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరంపై సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కుడి, ఎడమ కాలువలపై అధ్యయనం జరుగుతోందని జగన్‌ తెలిపారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్‌ […]

పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు.. త్వరలోనే అన్ని బయటపెడతాం..!

Edited By:

Updated on: Jul 19, 2019 | 11:47 AM

టీడీపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. పోలవరంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఆందోళన పై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరంపై సభలో మూడు రోజులుగా చర్చిస్తూనే ఉన్నామని సీఎం జగన్ చెప్పారు. పోలవరం స్కామ్‌ల ప్రాజెక్టు అని ఆయన ఆరోపించారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, కుడి, ఎడమ కాలువలపై అధ్యయనం జరుగుతోందని జగన్‌ తెలిపారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు మొదలు పెట్టాలని, నాలుగు నెలలుగా పనులు ఆగడానికి చంద్రబాబే కారణమని జగన్‌ మండిపడ్డారు. కాపర్ డ్యామ్ పనులు పైర్తైన తర్వాతే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక జూన్‌ 2021 నాటికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

పోలవరం పై తొలిసారిగా రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నామని చెప్పారు. దీనివల్ల రూ.1500 కోట్ల వరకు మిగులుతాయని, గత ప్రభుత్వం సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చిన వారిని తీసుకొచ్చి నామినేషన్‌ పద్ధతిలో వర్క్స్‌ ఇచ్చారని జగన్ విమర్శించారు.