అసైన్డ్ భూములు రద్దు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

|

Dec 19, 2019 | 9:24 AM

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని హింట్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో అసైన్డ్‌ ల్యాండ్స్‌ కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను రద్దు చేస్తూ వాటిని అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారికి ఇవ్వాలనుకున్న రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 1977 అసైన్డ్ […]

అసైన్డ్ భూములు రద్దు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Follow us on

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని హింట్ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో అసైన్డ్‌ ల్యాండ్స్‌ కొనుగోలుదారులకు షాక్‌ ఇస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను రద్దు చేస్తూ వాటిని అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారికి ఇవ్వాలనుకున్న రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

టీడీపీ హయాంలో రాజధాని పేరిట ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన నేతలు 4,070 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని..దాన్ని రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి.. ప్రభుత్వం నుంచి రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో లబ్దిపొందేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపిస్తోంది. కాగా, సీఎం మూడు రాజధానుల ప్రకటన కారణంగా ఇవాళ రైతులు అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు.