ఇప్పటికే భానుడి ప్రతాపంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతుంటే.. ఈ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ బాంబ్ పేల్చింది. ఈ నెల 19 నుంచి 23వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వారు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయట తిరిగే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.