ఇది ఆరంభం మాత్రమే.. ఏపీ అసెంబ్లీ బయట చంద్రబాబు నిరసన

| Edited By:

Jul 25, 2019 | 11:32 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా? అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆవరణ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టామని […]

ఇది ఆరంభం మాత్రమే.. ఏపీ అసెంబ్లీ బయట చంద్రబాబు నిరసన
Follow us on

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా కొనసాగుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా? అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అసెంబ్లీ ఆవరణ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు.

ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ర్యాలీ చేపట్టామని చంద్రబాబు తెలిపారు. సభలో తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు వెల్లడించారు.