Nara Lokesh: వాళ్లకి జీతాలివ్వకుండా.. ఆ వేల కోట్ల అప్పులు ఎవ‌రి జేబుల్లో వేశారు.. ఆర్థిక నేరాల్లో ఉన్న అతను పీఏసీ సభ్యుడా?: నారా లోకేష్

|

Aug 11, 2021 | 6:50 PM

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల అప్పులు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయో స‌మాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా

Nara Lokesh: వాళ్లకి జీతాలివ్వకుండా.. ఆ వేల కోట్ల అప్పులు ఎవ‌రి జేబుల్లో వేశారు.. ఆర్థిక నేరాల్లో ఉన్న అతను పీఏసీ సభ్యుడా?: నారా లోకేష్
Lokesh Farooq
Follow us on

Nara Lokesh – NMD Farooq: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల అప్పులు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయో స‌మాధానం చెప్పాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్.. మంత్రి బుగ్గన చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ.. “ప్రజల ప్రాణాలు కాపాడటానికి వేల కోట్ల అప్పులు చేశామని చెప్పే మంత్రి బుగ్గన.. 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి 6 నెల‌లుగా జీతాలివ్వలేదు.. చేసిన అప్పులు ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయో స‌మాధానం చెప్పాలి.” అని లోకేష్ ప్రశ్నించారు.

ఏపీలో కొవిడ్ సమయంలో అత్యవసర సేవలందించేందుకు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న తీసుకున్న 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి 6 నెల‌లుగా జీతాల్లేక తీవ్ర ఆందోళ‌న‌లో వున్నారని లోకేష్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నెలనెలా జీతాలంద‌క కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు అగ‌మ్యగోచ‌రంగా మారాయని లోకేష్ అన్నారు. కొవిడ్ వారియ‌ర్స్‌కి త‌క్షణ‌మే ఆరు నెల‌ల బ‌కాయిలు చెల్లించాలని లోకేష్ కోరారు.

ఇదిలా ఉండగా, మాజీమంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక నేరాల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని పీఏసీ సభ్యుడిగా నియమించడమేంటి? అని ఫరూక్ ప్రశ్నించారు. బుధవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలకు.. నిదర్శనంగా విజయసాయికి పదవి ఇచ్చారని విమర్శించారు. రేపో, మాపో సీబీఐ కోర్టులో హాజరుకాబోతున్న వ్యక్తిని.. పీఏసీలో నియమించి కేంద్ర పెద్దలు ఏం చెప్పదలుచుకున్నారని ఎన్‌ఎండీ ఫరూక్‌ నిలదీశారు.

Read also:  Police Torture: పోలీస్‌ అరాచకం తట్టుకోలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకొని యువకుడి సూసైడ్