TDP Chief Chandrababu on AP Corona Deaths : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముగ్గురు ఉద్యోగుల మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రణాళికా లోపమే ఉద్యోగుల మృతికి కారణమని చంద్రబాబు ఆరోపించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఉండగా, ఏపీ సచివాలయంలో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో ముగ్గురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన మొదలైంది. వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. మరోవైపు ఇటీవలే ప్రారంభమైన కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఆరుగురు ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు కరోనా టెస్ట్‌లు తప్పనిసరి చేసింది ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.
అటు, కాకినాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ప్రిన్సిపాల్ సహా ఐదుగురు లెక్చరర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విద్యార్థులు కూడా చాలా మంది కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విజయవాడలో వ్యాక్సిన్ కోసం జనాలు బారులు తీరారు. నగరంలోని అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో జనం కిక్కిరిసిపోయారు. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో చాలా చోట్ల వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మొదటి డోసు తీసుకుని 45 రోజులైనా రెండో డోసు వేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
Read also : Aryabhata : భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు, ఆపై ప్రపంచ రికార్డు వరకూ ఇస్రో ప్రస్థానం