సినిమావాళ్లకు ఓట్లు వేయొద్దు – పృథ్వి

ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో కొంతమందికి వైఎస్ జగన్ సీఎం కావడం జీర్ణించుకోలేకపోయారని.. వాళ్ళకి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారని అన్నారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తే సినిమా ఛాన్స్‌లు రావని కొంతమంది తనను భయపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పృథ్వి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎవరో తనకు అవకాశాలు ఇస్తారని.. ట్రంకు పెట్టెతో తాను హైదరాబాద్ రాలేదని.. అవకాశాలు […]

సినిమావాళ్లకు ఓట్లు వేయొద్దు - పృథ్వి

Updated on: Jul 27, 2019 | 8:43 PM

ఎస్వీబీసీ చైర్మన్, నటుడు పృథ్వి టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో కొంతమందికి వైఎస్ జగన్ సీఎం కావడం జీర్ణించుకోలేకపోయారని.. వాళ్ళకి చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకున్నారని అన్నారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తే సినిమా ఛాన్స్‌లు రావని కొంతమంది తనను భయపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పృథ్వి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎవరో తనకు అవకాశాలు ఇస్తారని.. ట్రంకు పెట్టెతో తాను హైదరాబాద్ రాలేదని.. అవకాశాలు తననే వెతుక్కుంటూ వచ్చాయని పృథ్వి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ.. సినిమావాళ్ళకు ఓట్లు వేయొద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్ళ పాటు అమరావతిలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని పృథ్వి పేర్కొన్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ మాదిరిగానే.. ఎస్వీబీసీ ఛానల్‌ను కూడా అభివృద్ధి చేసి మంచి పేరు తెస్తానని అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us