బ్రేకింగ్: ఆడియో టేపుల వ్యవహారం.. పృథ్వీ సంచలన నిర్ణయం

ఆడియో టేపుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో పృథ్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో మనస్తాపం చెందిన ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజీనామా చేయాలని పార్టీ అధిష్టాన వర్గం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపట్లో ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించనున్నారు. అయితే ఓ మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియోపై సీఐటీయూ వంటి సంస్థలు కూడా […]

బ్రేకింగ్: ఆడియో టేపుల వ్యవహారం.. పృథ్వీ సంచలన నిర్ణయం

Edited By:

Updated on: Jan 12, 2020 | 8:18 PM

ఆడియో టేపుల వ్యవహారం వివాదాస్పదం కావడంతో పృథ్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో మనస్తాపం చెందిన ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. రాజీనామా చేయాలని పార్టీ అధిష్టాన వర్గం ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపట్లో ఈ విషయాన్ని మీడియా ముందు ప్రకటించనున్నారు.

అయితే ఓ మహిళతో పృథ్వీ అసభ్యంగా మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియోపై సీఐటీయూ వంటి సంస్థలు కూడా ఖండించాయి. ఆయనపై వేటు వేయాలని వారు డిమాండ్ చేశారు.

దీనిపై పృథ్వీ స్పందిస్తూ.. తను ఎవ్వరితో అసభ్యంగా మాట్లాడలేదని, అందరూ తనను అన్నలా భావిస్తారని చెప్పుకొచ్చారు. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా తనది కాదని ఆయన తెలిపారు. దీనిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ వ్యవహారంపై నిజ నిర్ధారణ కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణ జరిపి వాస్తవాలను బయట పెట్టాలని టీటీడీ సీవీఎస్‌వోకు ఆదేశించామన్నారు. వాస్తవమేనని తేలితే.. సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ లోపే పృథ్వీ రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నారు.

Follow Us