వరద బాధితులను ఆదుకోవడం మాని.. డ్రోన్ రాజకీయాలు చేయడం తగదని టీడీపీ, వైసీపీలపై జనసేనాని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. కరకట్ట మీద డ్రోన్లు ఎగరవేయడం మంత్రుల బాధ్యత కాదని పవన్ చెప్పుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కన పెట్టి.. ముందుగా ముంపు బాధితులను ఆదుకోండి అంటూ ఆయన హితవు పలికారు.
కాగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై డ్రోన్లతో చిత్రీకరించడంపై వివాదం మొదలైంది. చంద్రబాబుపై కుట్రతోనే ఆయన ఇంటిపై డ్రోన్లతో నిఘా పెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు కుప్పిస్తుండగా.. వరద ఉదృతిని అంచనా వేసేందుకు తామే డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాల విమర్శలతో ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.