నా భిక్షతోనే జగన్ సీఎం అయ్యారు: పవన్

జగన్ తన భిక్ష వలనే సీఎం అయ్యాడు అన్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. చంద్రబాబు, బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని.. ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు. ఇక తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అన్న పవన్.. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే ఆ పార్టీతో విభేదించానని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో […]

నా భిక్షతోనే జగన్ సీఎం అయ్యారు: పవన్

Edited By:

Updated on: Dec 04, 2019 | 1:30 PM

జగన్ తన భిక్ష వలనే సీఎం అయ్యాడు అన్నట్లుగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్.. చంద్రబాబు, బీజేపీతో తాను కలిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేది కాదని.. ఈ విషయంలో వైసీపీ నేతలు తనకు దండం పెట్టాలని ఆయన కామెంట్లు చేశారు.

ఇక తాను బీజేపీకి ఎప్పుడూ దూరంగా లేను అన్న పవన్.. ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే ఆ పార్టీతో విభేదించానని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని.. ఇప్పటికీ తాను బీజేపీతో కలిసే ఉన్నానని స్పష్టతను ఇచ్చారు. దేశ ప్రయోజనాలు, ప్రజల కోసం బీజేపీ నిర్ణయాలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ఆయన మాటల తూటాలు పేల్చారు. కియా కంపెనీ సీఈవోను వైసీపీ ఎంపీ వేలు చేపించి బెదిరించారని పవన్ గుర్తుచేశారు. 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటే ఏ పరిశ్రమలు వస్తాయి..? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని.. తన ఇంటి దగ్గరలో జరుగుతున్న మత మార్పిడులు జగన్‌కు కనపడడం లేదా..? అని పవన్ కామెంట్లు చేశారు. వైసీపీ నేతలు తన ప్రతి మాటన వక్రీకరిస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us