నిరుద్యోగులకు తీపికబురు… 69వేల ఉద్యోగాల భర్తీ!

| Edited By: Pardhasaradhi Peri

Jul 05, 2019 | 5:51 PM

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. 2 వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసే గ్రామ సచివాలయంలో… 10 మంది ఉద్యోగులను నియమించనుంది. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 వేల 55 గ్రామ పంచాయితీలకు గానూ… 9 వేల 480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులను […]

నిరుద్యోగులకు తీపికబురు... 69వేల ఉద్యోగాల భర్తీ!
Follow us on

ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. 2 వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసే గ్రామ సచివాలయంలో… 10 మంది ఉద్యోగులను నియమించనుంది. డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి ఈ నెల 15లోపు నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 వేల 55 గ్రామ పంచాయితీలకు గానూ… 9 వేల 480 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ప్రతి 50 కుటుంబాలకు ఓ గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా చూడడం వాలంటీర్ల బాధ్యత. ఈ ఉద్యోగాల భర్తీకి జులై 15లోగా నోటిఫికేషన్ జారీ కానుంది. సెప్టెంబర్‌లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 15నుంచి 23 వరకూ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20 నాటికి గ్రామ సచివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెప్టెంబర్ 25నాటికి విధులు కేటాయిస్తారు. అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పని ప్రారంభమవుతుంది.