ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కొత్త కోర్సులు!

| Edited By:

Jul 27, 2019 | 4:13 AM

ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్( ఏఐసీటీఈ) అనుమతి మేరకు ఈ కొత్త కోర్సుల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తివిద్యా కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులకు అనుమతి లభించినట్లైంది. పవర్ ఎలక్ట్రానిక్స్, వీఎల్ఎస్ఐ సిస్టం డిజైన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, హైడ్రాలిక్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, అర్టిఫీషియల్ […]

ఏపీ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కొత్త కోర్సులు!
Follow us on

ఏపీలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో కొత్త కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్( ఏఐసీటీఈ) అనుమతి మేరకు ఈ కొత్త కోర్సుల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తివిద్యా కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు ఆధునిక కోర్సులకు అనుమతి లభించినట్లైంది. పవర్ ఎలక్ట్రానిక్స్, వీఎల్ఎస్ఐ సిస్టం డిజైన్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, హైడ్రాలిక్స్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాయిల్ మెకానిక్స్, బయో ఇన్ఫార్మాటిక్స్, కంప్యూటర్ నెట్‌వర్క్ తదితర నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు ఈ కోర్సుల్లో సీట్ల పెంపునకూ సాంకేతిక విద్యాశాఖ ఆమోదం తెలిపింది.