అధికార పార్టీపై ట్వీట్లు చేస్తూ వారిని విమర్శించే టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ కాసేపు రాజకీయాలను పక్కనపెట్టేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫార్ములా వన్ హెచ్2ఓ రేసింగ్‌పై ట్వీట్ చేశారు. ఈ రేస్‌లో పాల్గొన్న అమరావతి టీమ్ విజయం సాధించండపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అధ్బుతమైన ఆటతీరుతో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించారని విజేతలను కొనియాడు. ఇక బహుమతి ప్రదానోత్సవంలో వినిపించిన జాతీయగీతం వింటుంటే తన రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Congratulations to Team #Amaravati’s Jonas Andersson for producing a spectacular performance to clinch top honours at the UIM @F1_H2O Grand Prix of France. Goosebumps to see our National Anthem being played at the prize distribution ceremony. #f1h2o #powerboat #worldchampionship pic.twitter.com/j7lKBjnUhd
— Lokesh Nara (@naralokesh) July 8, 2019