బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే, ఆర్కే రోజా అంటేనే ఓ సెన్సేషన్.. ఆమె ఏం చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది..! నిత్యం ప్రజల్లో ఉండే రోజా.. నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ..

బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా

Updated on: Sep 06, 2020 | 3:55 PM

నగరి ఎమ్మెల్యే, ఆర్కే రోజా అంటేనే ఓ సెన్సేషన్.. ఆమె ఏం చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది..! నిత్యం ప్రజల్లో ఉండే రోజా.. నగరి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కారం చూపుతున్నారు. చివరకు కోవిడ్ నేపథ్యంలోనూ రోజా అనే సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా రోజా చొరవతో నగరి నియోజకవర్గానికి రెండు బైక్ అంబులెన్స్‌లు అందాయి. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు వీలుగా బైక్ అంబులెన్స్ తయారు చేసింది హీరో మోటార్స్ కంపెనీ. రోజా కోరిక మేరకు హీరో మోటార్స్ కంపెనీ రెండు బైక్ అంబులెన్స్ వాహనాలను అందజేసింది.

నగరి, పుత్తూరు ప్రభుత్వాసుపత్రులకు చెరొకటి చొప్పున బైక్ అంబులెన్స్‌ను అందజేశారు.వాటిని నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రోజా తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బైక్ అంబులెన్స్‌లను నడిపి సందడి చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తన విజ్ఞప్తి మేరకు బైక్ అంబులెన్స్‌లు అందజేసినందుకు గానూ.. హీరో మోటార్స్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రోజా.

Loading...
Unable to load recommendations.
Follow Us