పడవను అడ్డుపెట్టి.. వరదను అడ్డుకుంటారా “చిట్టినాయుడూ”..?: విజయసాయిరెడ్డి సెటైర్

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కొద్ది రోజులుగా వరద రాజకీయం నడుస్తుండటంతో లోకేష్ గతంలో చేసిన ట్వీట్ పై విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవను అడ్డుపెట్టి వరదను అడ్డుకుని కుట్ర చేశారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చిట్టినాయుడు అంటూ వ్యంగ్యంగా పిలిచారు. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటీకి చిట్టినాయుడు విధ్వంసకర ఐడియా ఇచ్చారంటూ ఘాటుగా స్పందించారు. […]

పడవను అడ్డుపెట్టి.. వరదను అడ్డుకుంటారా చిట్టినాయుడూ..?: విజయసాయిరెడ్డి సెటైర్

Edited By:

Updated on: Aug 20, 2019 | 4:14 PM

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాలోకేష్ లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కొద్ది రోజులుగా వరద రాజకీయం నడుస్తుండటంతో లోకేష్ గతంలో చేసిన ట్వీట్ పై విజయసాయిరెడ్డి స్పందించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవను అడ్డుపెట్టి వరదను అడ్డుకుని కుట్ర చేశారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చిట్టినాయుడు అంటూ వ్యంగ్యంగా పిలిచారు. ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థలన్నిటీకి చిట్టినాయుడు విధ్వంసకర ఐడియా ఇచ్చారంటూ ఘాటుగా స్పందించారు. టెర్రరిస్టులంతా తుపాకులు, బాంబులను పక్కకు పడేసి నాటు పడవలను ఆయుధాలుగా వాడాలని నిర్ణయించారట. డ్యాం గేట్లకు పడవలను అడ్డం పెట్టి వరద ముంపును సృష్టించొచ్చని ప్లాన్ వేస్తున్నారంటూ లోకేష్ ట్వీట్లు చేశారు. ఎంతైనా స్టాన్ఫోర్డ్ లో చదివాడు కదా? అంటూ లోకేష్ పై సెటైర్లు పేల్చారు.