కేంద్రమంత్రికి మిథున్‌ రెడ్డి లేఖ

Mithun Letter to Nirmala Sitharaman : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న నేతలకు గట్టి షాక్ ఇస్తోంది వైసీపీ. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్‌ను కోరిన వైసీపీ నేతలు.. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీలపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభలో వైసీపీ పక్షనేత మిథున్‌ రెడ్డి లేఖ రాశారు. కాషాయ కండువా కప్పుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ […]

కేంద్రమంత్రికి మిథున్‌ రెడ్డి లేఖ

Updated on: Jul 04, 2020 | 7:35 PM

Mithun Letter to Nirmala Sitharaman : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్న నేతలకు గట్టి షాక్ ఇస్తోంది వైసీపీ. సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్‌ను కోరిన వైసీపీ నేతలు.. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి జంపయిన ఎంపీలపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది.

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లోక్‌సభలో వైసీపీ పక్షనేత మిథున్‌ రెడ్డి లేఖ రాశారు. కాషాయ కండువా కప్పుకున్న తెలుగు దేశం పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై.. కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. వాళ్లు గతంలో బీజేపీపైన తీవ్ర విమర్శలు చేశారని లేఖలో మిథున్ రెడ్డి గుర్తుచేశారు.

గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో బీజేపీ పంచన చేరారని.. వాళ్లు ఏపీ ప్రభుత్వంపై తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని అన్నారు. కేంద్రానికి ఎలాంటి సమాచారం కోరినా ఇచ్చేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో వివరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us