చిక్కుల్లో సేనాని.. కేసు పెట్టిన సొంత పార్టీ నేత..!

గత కొద్దిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కులం, మతంపై పవన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. జనసేన పార్టీ నేత అలివర్ రాయ్ ఆయనపై కేసు పెట్టారు. కులమతాల్ని రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పున్నమిఘాట్ వద్ద మత మార్పిడిలు జరుగుతున్నాయన్న పవన్ వ్యాఖ్యలను అలివర్ రాయ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వెంటనే […]

చిక్కుల్లో సేనాని.. కేసు పెట్టిన సొంత పార్టీ నేత..!

Updated on: Dec 08, 2019 | 8:03 AM

గత కొద్దిరోజులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సొంత పార్టీ నేతలే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. కులం, మతంపై పవన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. జనసేన పార్టీ నేత అలివర్ రాయ్ ఆయనపై కేసు పెట్టారు. కులమతాల్ని రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

పున్నమిఘాట్ వద్ద మత మార్పిడిలు జరుగుతున్నాయన్న పవన్ వ్యాఖ్యలను అలివర్ రాయ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినా.. ఆయనలో పశ్చాతాపం లేకపోవడం వల్లే కేసు పెట్టానని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే సేనాని.. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ మండపేటలో టమోటా రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు.