ఏపీ సీఎంగా జగన్ తొలి ప్రసంగం

|

May 30, 2019 | 1:38 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచే కాకుండా, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌ తొలిసారిగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు… జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని […]

ఏపీ సీఎంగా జగన్ తొలి ప్రసంగం
Follow us on

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచే కాకుండా, తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా పలువురు రాజకీయ నేతలు, అభిమానులు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తదితరులు హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌ తొలిసారిగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు…

జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నా. 3,648కి.మీ ఈ నేల మీద నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.

…………………..
తెలంగాణ సీఎం కేసీఆర్‌, భవిష్యత్‌లో తమిళనాడుకు కాబోయే సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు

………………..

గత 9ఏళ్లుగా 3,648కి.మీ. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశా.. మీ కష్టాలు నేను చూశా. మీ బాధలు నేను విన్నా. నేను ఉన్నానని ఈరోజు చెబుతున్నా.

………………………
అందరి ఆశలు, ఆకాంక్షలు, పూర్తిగా పరిగణనలోకి తీసుకుంటూ రెండు పేజీలతో ప్రజలకు గుర్తుండిపోయేలా, కనిపించేలా, ప్రజల ప్రతి కష్టం కనిపించేలా మేనిఫెస్టో తీసుకొచ్చా.

………………….
గత ప్రభుత్వాల మాదిరి, పాలకుల మాదిరిగా పేజీలకు పేజీలు, పుస్తకాలకు పుస్తకాలు తీసుకురాలేదు. ప్రతి కులానికీ ఒక పేజీ పెట్టి ఆ కులాన్ని మోసం చేసేలా మేనిఫెస్టో తీసుకురాలేదు. ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పుస్తకంలా మేనిఫెస్టోను తీసుకురాలేదు. మేనిఫెస్టో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. మేనిఫెస్టోను ఒక ఖురాన్‌లా, బైబిల్‌లా, ప్రతి అంశం ఒక భగవద్గీతలా భావిస్తా. అదే నా ఊపిరిగా ఈ ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని ముఖ్యమంత్రి హోదాలో మాటిస్తున్నాను. మీ అందరికీ మాట ఇచ్చినట్లుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి చెబుతా.

……………………

ఈ రోజు అవ్వ, తాతల కోసం ఈ కార్యక్రమంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నా. నేను ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్‌ను రూ.3వేలకు పెంచుతున్నా. నా మొదటి సంతకం ఈ ఫైల్‌ మీదే పెడుతున్నా. మొదటిగా రూ.2,250లతో పెంచిన పెన్షన్‌ను ప్రారంభించి, వచ్చే ఏడాది రూ.2,500, ఆ తర్వాత రూ.2,750, ఆ తర్వాతి ఏడాది రూ.3000లకు పెంచుతాం.

……………………..
ఆగస్టు 15వ తేదీ వచ్చే సరికి గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలవరీ చేసేలా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తున్నా. గ్రామాల్లో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలని ఆరాటం ఉన్న పిల్లలు రూ.5వేలు జీతం ఇస్తూ, గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు.  ఆ రూ.5వేలు ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఈ వ్యవస్థలో లంచం లేకుండా చేయాలి. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పథకంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదనే ఉద్దేశంతోనే రూ.5వేలు జీతం ఇస్తాం.

…………………………

ఆగస్టు 15న ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. అవినీతి జరిగిందని తెలిసినా, ప్రభుత్వ పథకాలు అందలేకపోయినా, వివక్ష జరిగిందని భావించినా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేసి చెప్పవచ్చు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తాం. మీ గ్రామంలోని సెక్రటేరియట్‌లో 10 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తాం. ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా మొదలు పెడతాం. దీని వల్ల మరో లక్షా 60వేల ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి.

………………………..

అవినీతి లేని పాలనను తీసుకొస్తా..కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా పాలన సాగిస్తా

……………………

ప్రభుత్వ పథకాలు డోర్ డెలవరీగా మీ ఇంటికి రాబోతున్నాయి..

……………………..

ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆ దేవుడికి, మీకు, పైన ఉన్న నాన్నకు, పక్కనే ఉన్న అమ్మకు జన్మజన్మలకు రుణపడి ఉంటా